None
EN
Fact Check: జేపీఎస్సీ పరీక్షలలో 'అక్రమాలు'.. జార్ఖండ్ విద్యార్థులు కాషాయ జెండాలతో ర్యాలీ చేశారా.? అసలు నిజం ఇదీ
['M Ramesh Naik']
Newsmeter | Latest Regional breaking news from Telangana and Andhra Pradesh
ఇది రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన వేరే ఆందోళనకు సంబంధించిన వీడియో.
కథనం ప్రకారం, శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు మహిపాల్ సింగ్ మక్రానా నేతృత్వంలో వేలాది మంది సభ్యులు జైపూర్‌కు చేరుకున్నారు.
సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, 24 రోజుల పాటు 800 కిలోమీటర్ల మేర సాగిన మార్చ్ అనంతరం వారు జైపూర్‌కు చేరుకున్నారు.
కర్ణి సేన సభ్యులు కలెక్టరేట్ వైపు ర్యాలీగా వెళ్లడంతో పాటు బీజేపీ కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు కథనం పేర్కొంది.
కర్ణి సేన అధ్యక్షుడు మహిపాల్ సింగ్ మక్రానా నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో, ఈ నిబంధనలు అగ్రవర్ణ విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నాయని ఆరోపిస్తూ వాటిని ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.