None
IT
BSNL Super Plan: వన్ రూపీ వన్ మంత్ ఆఫర్ రేపటితో క్లోజ్ అవుతుంది.!
[]
Digit.in
BSNL Super Plan: బిఎస్ఎన్ఎల్ చాలా రోజులుగా కొనసాగిస్తూ వస్తున్న ఒక్క రూపాయి అన్లిమిటెడ్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది.
ఆగస్టు 2025 లో బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ను ప్రకటించింది మరియు ఈ ఆఫర్ ను కొత్త సంవత్సరంలో కూడా ముందు కొనసాగించింది.
ఇదే ఆఫర్ ను బిఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ సందర్భంగా 2026 న్యూ ఇయర్ ఆఫర్ గా ప్రకటించింది అయితే, ఈ ఆఫర్ ను 1 జనవరి 2026 నుంచి 31 జనవరి 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంచింది.
అంటే, బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ వన్ రూపీ వన్ మంత్ అన్లిమిటెడ్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది.
ఈ అన్లిమిటెడ్ లాభాల్లో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు ప్రతి రోజు 100 SMS వినియోగ ప్రయోజనం వంటి పూర్తి ప్రయోజనాలు అందిస్తుంది.